ముండ్లమూరులో టిడిపి హవా.
సూర్య న్యూస్ ముండ్లమూరు. ముండ్లమూరు మండల పరిషత్ ప్రాదేశికళలో టిడిపి హవా స్పష్టంగా కనిపించింది. మండలంలోమొత్తం 16 ఎంపీటీసీలు ఉండగా. 16 ఎంపీటీసీలు టిడిపికి ఏకగ్రీవం అయ్యాయి. పసుపులు ఎంపీటీసీగా బిజ్జం సుబ్బారెడ్డి. ఉల్లగల్లు ఎంపీటీసీగా కామణి కమలమ్మ పోలవరం ఎంపీటీసీగా మేదరమెట్ల గౌరీ, సింగన్నపాలెం ఎంపీటీసీగా అచ్చు కట్ల నరేష్, ముండ్లమూరు ఎంపీటీసీగా మేదరమెట్ల పిచ్చారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వేముల 2 ఎంపీటీసీగా పిడతల ఆరోగ్యం, భీమవరం ఎంపీటీసీగా కొండేద్దు నాగమ్మ, ఈదర ఎంపీటీసీగా అడపాల వెంకాయమ్మ, మారెళ్ళ ఎంపీటీసీగా ఎనిక బోయిన శ్రీను, కెల్లంపల్లి ఎంపీటీసీగా మేరా జ్యోతి అంజి బాయ్, పూరి మెట్ల ఎంపీటీసీగా ఓరూరి నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఉమామహేశ్వరపురం ఎంపీటీసీగా దేవినేని రమాదేవి నూజిలపల్లి ఎంపీటీసీగా చాగంటి హనుమంతరావు నాయుడుపాలెం ఎంపీటీసీగా వేమవరపు నెహెమ్యా పులిపాడు ఎంపీటీసీగా దాసరి శ్రావణి వేముల 1 ఎంపీటీసీగా పంది వెంకాయమ్మ ఏకగ్రీవం అయ్యారు. 16 ఎంపీటీసీలు లో టిడిపి అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. మండల వ్యవస్థఏర్పడిన తర్వాత ఏడుసార్లు ఎన్నికల జరగా ఆరుసార్లు ఎంపీపీ పీఠ నీ టిడిపి దక్కించుకుంది.నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సహాయ సహకారాలతో మండలాన్ని అభివృద్ధి చేస్తామని ఏకగ్రీవంగా ఎంపికైన టిడిపి ఎంపీటీసీలు తెలిపారు.