ఘనంగా భావానంద స్వామి జయంతి ఉత్సవాలు
మర్కుక్ : మండలంలోని పాండురంగ ఆశ్రమ వ్యవస్థాపకులు
భావానంద భారతి స్వామి వారి 127 వ జయంతి ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామి వారి సమాధి ప్రాంగణాన్ని రకరకాల పుష్పాల తో అలంకరించారు. స్వామివారికి క్షీర అభిషేకము లక్ష పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు తీసుకొచ్చిన 56 రకాల మధుర పదార్థాలతో స్వామివారికి చెప్పన్ బోగ్ నివేదన చేశారు. అనంతరం పుష్పాలతో అలంకరించిన ఊయల కట్టి అందులో స్వామివారి చిత్రపటాన్ని ఉంచి అప్పుడే పుట్టిన శిశువుకు చేసినట్లుగా డోలోత్సవాన్ని వైభవో పేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదంతో పాటు భోజన ప్రసాదాన్ని స్వీకరించారు