BREAKING
మెగాస్టార్ చిరంజీవి మెగావర్స్ షోకి రంగం సిద్ధం.. పూర్తి వివరాలు ఇవే ఉత్తరాంధ్ర ప్రజల కొంగుబంగారం – విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం! రెండు రోజులు పాఠశాలలు సెలవులు మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ షేర్ మహమ్మద్ పేట టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య వారణాసి' కథపై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకధీరుడు రాజమౌళి సీతానగరం మండలం జడ్పీటీసీ అభ్యర్థి కంకణపల్లి అనురాధ కు బి ఫారం అందచేసిన ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర… పదిహేను రోజుల వ్యవధిలో రెండు భారీ చిత్రాలతో సాయిపల్లవి సందడి అవినీతిని తొలగించి అభివృద్ధికి పట్టం కడదాం హకీంపేటలో రైతు మేళాకు సన్నాహాలు.. స్థలాలను పరిశీలించిన కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా ఓటీటీలోకి సుందీప్ కిషన్ సినిమా.. ప్రముఖ డిజిటల్ వేదికపై స్ట్రీమింగ్ ఎప్పుడంటే? జగ్గయ్యపేట పట్టణంలో కూటమి ప్రచార హోరు నాలుగు వార్డుల్లో రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి ముమ్మర పర్యటన అభివృద్ధి వైపే అడుగులు వేస్తున్నాం... కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. జనసేన అభ్యర్థికి బీఫారం అందజేసిన సామినేని

అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో అనకాపల్లిలో ఎస్డీపీఓ హై అలర్ట్ వరద ప్రభావిత గ్రామాల్లో పరిశీలన.

Select Suryaa Now
అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో అనకాపల్లిలో ఎస్డీపీఓ హై అలర్ట్  వరద ప్రభావిత గ్రామాల్లో పరిశీలన.

ముందస్తు చర్యలు ముమ్మరం.
అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు తో, ఎస్డీపీఓ అనకాపల్లి పి.వి.వి. నరసింహారావు మంగళవారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఎస్డీపీఓ, సీఐ జి. అశోక్ కుమార్, ఎస్ఐ జి. రవి కుమార్, సిబ్బందితో కలిసి గత ఏడాది భారీ వరదలకు గురై రహదారులు తెగిపోయిన వెంకుపాలెం, కుంచంగి గ్రామాలను సందర్శించి, గ్రామస్తులతో మాట్లాడి సంసిద్ధతను పరిశీలించారు. అనంతరం కొప్పాక గ్రామం వద్ద జాతీయ రహదారి పై ఉన్న ఏలేరు కాలువను పరిశీలించారు. జాతీయ రహదారిపై నీరు నిలిచిపోకుండా ఉండేందుకు జీవీఎంసీ సహకారంతో నీటి ప్రవాహానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయించారు. ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు పలు జాగ్రత్తలు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, వాతావరణ శాఖ అధికారిక హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలి. సోషల్ మీడియాలో పుకార్లను నమ్మవద్దు. లోతట్టు ప్రాంతాలు, పూరి గుడిసెలు, బలహీనమైన ఇళ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు / పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు, పడవలు, వలలను సురక్షిత ప్రదేశంలో ఉంచుకోవాలి. బలమైన గాలులు వీచే సమయంలో పాత భవనాలు, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద ఉండరాదు. త్రాగునీరు, మందులు, టార్చ్ లైట్, చార్జ్ చేసిన మొబైల్ ఫోన్లు, ముఖ్యమైన పత్రాలతో అత్యవసర కిట్ సిద్ధంగా ఉంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో 100 / 112 కు డయల్ చేయాలి లేదా స్థానిక పోలీస్ / రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలి. తుఫాన్ పై వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని, పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఎస్డీపీఓ తెలిపారు. ఈ పర్యటనలో ఎస్డీపీఓ అనకాపల్లి పి.వి.వి. నరసింహారావు, సీఐ జి. అశోక్ కుమార్, ఎస్ఐ జి. రవి కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.