కోతుల బెడదకు చెక్ పెట్టిన ప్రగల్లపల్లి సర్పంచ్.
కోతుల బెడదకు చెక్ పెట్టిన ప్రగల్లపల్లి సర్పంచ్.
దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్)::
ప్రగల్లపల్లి గ్రామంలో గత కొంతకాలంగా తీవ్రంగా వేధిస్తున్న కోతుల బెడద నుంచి ప్రజలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ నవీన్ ప్రత్యేక చొరవతో నివారణ చర్యలు చేపట్టారు.కోతులకు ఎలాంటి హాని తలపెట్టకుండా మానవతా దృక్పథంతో వాటిని సురక్షితంగా ఇనుప బోనుల్లో బంధించి ఆహారం అలవాటు చేసిన అనంతరం సుదూర అటవీ ప్రాంతంలో విడిచిపెడుతున్నారు. ఈ సందర్భంగా కోతులను పట్టుకోవడంలో సహకరిస్తున్న స్థానికులు అంగీరేకుల రమేష్,జలగం వాసు ల సేవలను గ్రామస్తులు కొనియాడారు.గ్రామ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్న సర్పంచ్ నవీన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.