అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి. ఎమ్మెల్యే వెంకట్రావు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి. ఎమ్మెల్యే వెంకట్రావు.
భద్రాచలం సూర్య న్యూస్::
భద్రాచలం పట్టణంలోని గ్రంథాలయాన్ని భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు సందర్శించారు.ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియపై అక్కడ ఉన్న పట్టభద్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.2023 అక్టోబర్ నాటికి డిగ్రీ పట్టా పొంది అర్హులైన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సూచించారు.అర్హత కలిగిన పట్టభద్రులు ఎవరూ ఓటరు నమోదును నిర్లక్ష్యం చేయకుండా,ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.