BREAKING
మెగాస్టార్ చిరంజీవి మెగావర్స్ షోకి రంగం సిద్ధం.. పూర్తి వివరాలు ఇవే ఉత్తరాంధ్ర ప్రజల కొంగుబంగారం – విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం! రెండు రోజులు పాఠశాలలు సెలవులు మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ షేర్ మహమ్మద్ పేట టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య వారణాసి' కథపై సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకధీరుడు రాజమౌళి సీతానగరం మండలం జడ్పీటీసీ అభ్యర్థి కంకణపల్లి అనురాధ కు బి ఫారం అందచేసిన ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర… పదిహేను రోజుల వ్యవధిలో రెండు భారీ చిత్రాలతో సాయిపల్లవి సందడి అవినీతిని తొలగించి అభివృద్ధికి పట్టం కడదాం హకీంపేటలో రైతు మేళాకు సన్నాహాలు.. స్థలాలను పరిశీలించిన కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా ఓటీటీలోకి సుందీప్ కిషన్ సినిమా.. ప్రముఖ డిజిటల్ వేదికపై స్ట్రీమింగ్ ఎప్పుడంటే? జగ్గయ్యపేట పట్టణంలో కూటమి ప్రచార హోరు నాలుగు వార్డుల్లో రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి ముమ్మర పర్యటన అభివృద్ధి వైపే అడుగులు వేస్తున్నాం... కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. జనసేన అభ్యర్థికి బీఫారం అందజేసిన సామినేని

8వ డివిజన్ అభ్యర్థి కోటూరు ఆంజనేయులు విస్తృత ప్రచారం.

Select Suryaa Now
8వ డివిజన్ అభ్యర్థి కోటూరు ఆంజనేయులు విస్తృత ప్రచారం.

తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్.

8వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కోటూరు ఆంజనేయులు జోరుగా ఇంటింటి ప్రచార

తిరుపతి నగరపాలక సంస్థకు జరగనున్న 2వ సాధారణ ఎన్నికలు - 2026 నేపథ్యంలో 8వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి కోటూరు ఆంజనేయులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సోమవారం 8వ వార్డులోని పలు వీధుల్లో ఆయన ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. స్థానిక మహిళలు, పెద్దలు, యువతను నేరుగా కలుసుకుని వైఎస్ఆర్సీపీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. మహిళలకు ఎన్నికల కరపత్రాలను స్వయంగా అందజేసి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ ప్రచారంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పార్టీ జెండాలు, కండువాలు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కోటూరు ఆంజనేయులు మాట్లాడుతూ 8వ వార్డు అభివృద్ధే నా లక్ష్యం. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పాలనను ప్రజలు గమనిస్తున్నారు. వార్డులో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తా. ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తా. నన్ను కార్పొరేటర్ గా గెలిపిస్తే 8వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా అని హామీ ఇచ్చారు.ప్రచారానికి స్థానిక మహిళల నుండి విశేష స్పందన లభించింది. పలువురు మహిళలు హారతులు ఇచ్చి ఆయనకు మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ 8వ వార్డు నాయకులు రాపూరి ప్రసాద్, జెకె కాటయ్య, రాణమ్మ, మునేశ్వరమ్మ, చంద్రమోహన్, ఏవి రత్నం, ఈ శివ, సరోజమ్మ, నీలమ్మ మరియు మహిళా కార్యకర్తలు, యువజన విభాగం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి