andhrapradesh
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి నివాసంలో జరగనున్న వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆయన హస్తినకు వెళ్లనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన వివరాల్లోకి వెళ్తే.. సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం 2:40 గంటలకు అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత ఆయన నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి నివాసానికి వెళ్తారు. అక్కడ జరగనున్న వివాహ శుభకార్యానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు రాత్రికి తిరిగి అమరావతి చేరుకుని ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.