BREAKING
ఏపీలో ముంచుకొస్తున్న తుఫాను ముప్పు.. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ! జాతీయ డ్రోన్ పోటీకి గీతం క్యాడెట్ల ఎంపిక తెలంగాణ నుంచి నలుగురు ఎంపిక అందులో ఇద్దరు గీతం ఎన్.సి.సి. క్యాడెట్లు విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించిన ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు కళ్యాణదుర్గం పట్టణన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతాం. అమిలినేని యశ్వంత్. కోతుల బెడదకు చెక్ పెట్టిన ప్రగల్లపల్లి సర్పంచ్. ఘనంగా భావానంద స్వామి జయంతి ఉత్సవాలు ఎర్రబోడలో భారీ శబ్దం.. ప్రకంపనలతో ప్రజల్లో కలకలం! భూసార పరీక్షల ఆధారంగానే ఎరువుల వినియోగం జోరు వానలో సైతం వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ ముమ్మర ప్రచారం మూడో టీ20లో న్యూజిలాండ్ దూకుడు: 7.4 ఓవర్లలో 86/1 చెమల్లపల్లె ఎంపీటీసీగా చిల్లరగాళ్ల సుభాన్ బీ ఏకగ్రీవం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి. ఎమ్మెల్యే వెంకట్రావు. 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే సతీమణి అనూష విస్తృత ప్రచారం ఇస్నాపూర్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన త్రిపురవరం ఎంపీటీసీగా జోగాల్ల ఎల్లయ్య ఏకగ్రీవ ఎన్నిక

చెప్పాం.. చేశాం.. ధైర్యంగా ఓటు అడుగుతున్నాం

Select Suryaa Now
చెప్పాం.. చేశాం.. ధైర్యంగా ఓటు అడుగుతున్నాం

అమరావతి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం సాధించిన విజయం, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

పట్టణ ప్రాంతాల్లో (అర్బన్ ఏరియా) పారదర్శకత పెంచేందుకు ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని తీసుకొచ్చామని, నాయకత్వంలో యువతకు, ఉన్నత చదువులు చదివిన వారికి పెద్దపీట వేశామని ముఖ్యమంత్రి తెలిపారు. "మేము ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో వాటిని నెరవేర్చాం.. చెప్పాం, చేశాం కాబట్టే ఈరోజు ప్రజల ముందుకు వచ్చి ధైర్యంగా ఓటు అడుగుతున్నాం" అని ఆయన స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ పాలనలో ఆర్థికంగా "వెంటిలేటర్‌పై ఉన్న ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టింది" అని సీఎం అభివర్ణించారు. ప్రజలపై విద్యుత్ భారం పడకుండా కొత్తగా కరెంట్ ఛార్జీలు పెంచలేదని, పైగా పాత విద్యుత్ ట్రూఆప్ ఛార్జీలను తగ్గించి ఉపశమనం కలిగించామని చెప్పారు. రాయలసీమ ప్రాంతాన్ని దేశంలోనే "గ్రీన్ ఎనర్జీ హబ్"గా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు.

పరిశ్రమల స్థాపనలో రాష్ట్రం 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' నుంచి ఒక అడుగు ముందుకు వేసి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' స్థాయికి చేరుకుందని, పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నామని సీఎం తెలిపారు. అభివృద్ధి సంక్షేమ ఫలాలు కొనసాగాలంటే స్థానిక పోరులో కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.