రైతుల అభివృద్ధికి ఎఫ్‌పీవోలే వేదిక
నవాబుపేట సూర్య న్యూస్: నవాబుపేట మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం,నాబార్డు ఆధ్వర్యంలో అమలు చేస్తున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా రైతులు అన్ని రకాల పథకాల ప్రయోజనాలు పొందుతూ అభివృద్ధి చెందవచ్చని సంఘం చైర్మన్ మాడెమోని నర్సింహులు పేర్కొన్నారు.మండలంలో రైతులు,రైతు ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యత్వం పొందాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సంఘటితంగా ఉంటే వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు.రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు,ఆదాయాభివృద్ధికి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు దోహదపడతాయని వివరించారు.రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాడెమోని నర్సింహులు అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ముత్యాల రవీందర్ రెడ్డి,మాజీ ఎంపీపీ కర్రోళ్ల శ్రీనివాస్,గ్రామ సర్పంచ్ యాదగిరి,సంఘం డైరెక్టర్ ప్రతాప్,గండు చెన్నయ్య,రైతులు చంద్రశేఖర్ రెడ్డి,శ్యాంసుందర్ రెడ్డి,ముఖ్య కార్యనిర్వహణ అధికారి హన్మంత్ తదితరులు పాల్గొన్నారు.