BREAKING
సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలోని పలు వీధులకు మట్టి తోలకాలు.. ఏపీలో ముంచుకొస్తున్న తుఫాను ముప్పు.. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ! జాతీయ డ్రోన్ పోటీకి గీతం క్యాడెట్ల ఎంపిక తెలంగాణ నుంచి నలుగురు ఎంపిక అందులో ఇద్దరు గీతం ఎన్.సి.సి. క్యాడెట్లు విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించిన ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు కళ్యాణదుర్గం పట్టణన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతాం. అమిలినేని యశ్వంత్. కోతుల బెడదకు చెక్ పెట్టిన ప్రగల్లపల్లి సర్పంచ్. ఘనంగా భావానంద స్వామి జయంతి ఉత్సవాలు ఎర్రబోడలో భారీ శబ్దం.. ప్రకంపనలతో ప్రజల్లో కలకలం! భూసార పరీక్షల ఆధారంగానే ఎరువుల వినియోగం జోరు వానలో సైతం వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ ముమ్మర ప్రచారం మూడో టీ20లో న్యూజిలాండ్ దూకుడు: 7.4 ఓవర్లలో 86/1 చెమల్లపల్లె ఎంపీటీసీగా చిల్లరగాళ్ల సుభాన్ బీ ఏకగ్రీవం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి. ఎమ్మెల్యే వెంకట్రావు. 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే సతీమణి అనూష విస్తృత ప్రచారం ఇస్నాపూర్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

ఓటు హక్కును కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు : బిజెపిపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శలు

Select Suryaa Now
ఓటు హక్కును కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు :  బిజెపిపై  ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శలు

 సూర్య బ్యూరో ప్రతినిధి :  ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ పేరుతో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి ఆటంకాలు కల్పించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

మంగళవారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో మాట్లాడిన ఆయన.. ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నాకు పోటీగా హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు. ఓటర్ల జాబితా నుంచి దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు తొలగించారన్నది కాంగ్రెస్ ఆరోపణగా పేర్కొంటూ, ఓటు హక్కు కోల్పోయామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఎన్నికల సంఘం స్పందించడం లేదని అన్నారు.

ఈడీ, ఐటీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను, ఎన్నికల సంఘాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని అద్దంకి దయాకర్ ఆరోపించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చడంలో బీజేపీ పాత్ర ఉందని విమర్శించారు. బీజేపీతో పొత్తు విష కౌగిలి వంటిదని వ్యాఖ్యానిస్తూ, ఎన్డీఏ నుంచి బయటకు రావాలని చంద్రబాబుకు సూచించారు. బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు చర్చలు జరుగుతున్నాయని ఆరోపించారు.

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని విమర్శించిన ఆయన, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. మోదీ విదేశాంగ విధానంపైనా ఆయన విమర్శలు చేశారు.