BREAKING
సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలోని పలు వీధులకు మట్టి తోలకాలు.. ఏపీలో ముంచుకొస్తున్న తుఫాను ముప్పు.. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ! జాతీయ డ్రోన్ పోటీకి గీతం క్యాడెట్ల ఎంపిక తెలంగాణ నుంచి నలుగురు ఎంపిక అందులో ఇద్దరు గీతం ఎన్.సి.సి. క్యాడెట్లు విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించిన ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు కళ్యాణదుర్గం పట్టణన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతాం. అమిలినేని యశ్వంత్. కోతుల బెడదకు చెక్ పెట్టిన ప్రగల్లపల్లి సర్పంచ్. ఘనంగా భావానంద స్వామి జయంతి ఉత్సవాలు ఎర్రబోడలో భారీ శబ్దం.. ప్రకంపనలతో ప్రజల్లో కలకలం! భూసార పరీక్షల ఆధారంగానే ఎరువుల వినియోగం జోరు వానలో సైతం వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ ముమ్మర ప్రచారం మూడో టీ20లో న్యూజిలాండ్ దూకుడు: 7.4 ఓవర్లలో 86/1 చెమల్లపల్లె ఎంపీటీసీగా చిల్లరగాళ్ల సుభాన్ బీ ఏకగ్రీవం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి. ఎమ్మెల్యే వెంకట్రావు. 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే సతీమణి అనూష విస్తృత ప్రచారం ఇస్నాపూర్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

వచ్చే ఏడాది డిసెంబర్‌ లోగా 550 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి - నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ పాటిల్‌

Select Suryaa Now
వచ్చే ఏడాది డిసెంబర్‌ లోగా 550 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి - నాగర్ కర్నూల్  జిల్లా కలెక్టర్ హేమంత కేశవ పాటిల్‌

  ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న 550 పడకల  నిర్మాణ పనుల విషయంలో ఎలాంటి జాప్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని , పెండింగ్‌లో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్ణీత లక్ష్యాలను చేరుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ హేమంత కేశవ పాటిల్‌  సూచించారు.ఆసుపత్రి పనులను మంగళవారం సందర్శించి క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్ ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా పెండింగ్‌లో ఉన్న  నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్  నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా నిర్మాణ పనులు ఏ మేరకు పూర్తయ్యాయి, ఇంకా ఎలాంటి పనులు చేపట్టాల్సి ఉంది, నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనే అంశాలపై కలెక్టర్‌ అధికారులతో చర్చించారు. మిగిలి ఉన్న పనులను గుర్తించి, వాటిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌  మాట్లాడుతూ... నాగర్‌కర్నూల్‌ మెడికల్‌ కళాశాల ఆవరణలో నిర్మిస్తున్న 550 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను వచ్చే ఏడాది డిసెంబర్‌ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రభుత్వం నిర్దేశించిన నమూనా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా జరగాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. నిర్మాణంలో ఉపయోగించే సామగ్రి నాణ్యతతో పాటు పనుల ప్రమాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గడువులోగా పనులు పూర్తి చేయడమే కాకుండా, భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ఆసుపత్రి నిర్మాణం నాణ్యతతో ఉండాలని సూచించారు.
నిర్మాణంలో మిగిలి ఉన్న పనులను గుర్తించి, వాటి పూర్తికి అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ఎదురయ్యే సమస్యలను సకాలంలో పరిష్కరించుకోవాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, పనులను నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేసేలా బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.జిల్లా కలెక్టర్ వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఎండి సులేమాన్, ఇంజనీరింగ్ అధికారి సుధాకర్ రెడ్డి, ఇతర మెడికల్ కళాశాల అధికారులు తదితరులు ఉన్నారు.
పి. వినయ్ కుమార్, నాగర్‌కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్