BREAKING
సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలోని పలు వీధులకు మట్టి తోలకాలు.. ఏపీలో ముంచుకొస్తున్న తుఫాను ముప్పు.. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ! జాతీయ డ్రోన్ పోటీకి గీతం క్యాడెట్ల ఎంపిక తెలంగాణ నుంచి నలుగురు ఎంపిక అందులో ఇద్దరు గీతం ఎన్.సి.సి. క్యాడెట్లు విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించిన ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు కళ్యాణదుర్గం పట్టణన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతాం. అమిలినేని యశ్వంత్. కోతుల బెడదకు చెక్ పెట్టిన ప్రగల్లపల్లి సర్పంచ్. ఘనంగా భావానంద స్వామి జయంతి ఉత్సవాలు ఎర్రబోడలో భారీ శబ్దం.. ప్రకంపనలతో ప్రజల్లో కలకలం! భూసార పరీక్షల ఆధారంగానే ఎరువుల వినియోగం జోరు వానలో సైతం వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ ముమ్మర ప్రచారం మూడో టీ20లో న్యూజిలాండ్ దూకుడు: 7.4 ఓవర్లలో 86/1 చెమల్లపల్లె ఎంపీటీసీగా చిల్లరగాళ్ల సుభాన్ బీ ఏకగ్రీవం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి. ఎమ్మెల్యే వెంకట్రావు. 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే సతీమణి అనూష విస్తృత ప్రచారం ఇస్నాపూర్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

దీపావళి సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ ను(పర్యావరణహిత బాణసంచా) మాత్రమే విక్రయించాలి, కాల్చాలి* *జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి*

Select Suryaa Now
దీపావళి సందర్భంగా  గ్రీన్ క్రాకర్స్ ను(పర్యావరణహిత బాణసంచా) మాత్రమే విక్రయించాలి, కాల్చాలి*    *జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి*

 

*దీపావళి సందర్భంగా  గ్రీన్ క్రాకర్స్ ను(పర్యావరణహిత బాణసంచా) మాత్రమే విక్రయించాలి, కాల్చాలి*  

*జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి*

కర్నూలు, అక్టోబర్ 27:  సుప్రీంకోర్టు మరియు జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT) ఆదేశాలకు అనుగుణంగా  ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) సూచించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో   దీపావళి పండుగ సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ (పర్యావరణహిత బాణసంచా) మాత్రమే విక్రయించాలని, కాల్చాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని నగరాలు మరియు పట్టణాల్లో, CSIR-NEERI ద్వారా ధృవీకరించబడిన గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే అమ్మడానికి మరియు కాల్చడానికి అనుమతి ఉంటుందని  కలెక్టర్ తెలిపారు.

CSIR-NEERI నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ధృవీకరించబడిన గ్రీన్ క్రాకర్స్‌నే వర్తించే నిబంధనల ప్రకారం విక్రయించేలా, వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిషేధిత రసాయనాలు కలిగిన బాణసంచా తయారీ, విక్రయాలు, రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్  అధికారులను ఆదేశించారు.

పండుగ సమయంలో అనుమతించబడిన గ్రీన్ క్రాకర్స్‌ను, సంబంధిత నియంత్రణ మార్గదర్శకాలు మరియు న్యాయస్థానాల ఆదేశాల ప్రకారం నిర్దేశించిన సమయాల్లో మాత్రమే కాల్చాలని, సమయ పరిమితులను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ తెలిపారు.

ఈ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేసేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.