BREAKING
ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి : కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్ , 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా .. ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం: బీఆర్‌ఎస్ నేత లాస్ ఏంజెలిస్‌లో ‘రామాయణ’ గ్రాండ్ ప్రీమియర్ షో.. నవంబర్ 5న ప్రపంచవ్యాప్త విడుదల నిజాంపట్నం-రేపల్లె రోడ్డులో చెట్టు తొలగింపు తుఫాను వేళ ఉయ్యూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చేనేత కుటుంబాల సంక్షేమమే లక్ష్యం.. నేతన్నలకు అండగా ఉంటా స్వతంత్ర అభ్యర్థి డి. నజీర్ అహ్మద్ మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలూ కరువు జాబితాలో ఉండటం బాధాకరం: బిఆర్ఎస్ రాష్ట్ర నాయకు రాలు పాల్వాయి స్రవంతి రెడ్డి రజినీకాంత్ ధర్మన్ మూవీ ఓటీటీ డీల్ రూ.150 కోట్లు నిజమేనా దుబాయ్‌లో ఘనంగా యూఏఈ కౌండిన్య సేన (గౌడ బంధువుల) దసరా సంబరాలు గేమ్ ఛేంజర్ కథపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సంచలన వ్యాఖ్యలు.. అసలు మేటర్ ఇదే! సినిమా ట్విస్ట్‌పై దర్శకుడు పూర్వాజ్ సంచలన కామెంట్స్.. రాజమౌళి వ్యాఖ్యలపై స్పష్టత! తుపాను ప్రభావంతో జాతీయ సదస్సు వాయిదా కొండ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలే తప్ప అభివృద్ధి జరగలేదు...ఎంపీ బస్తిపాటి నాగరాజు కల్వల ప్రాజెక్ట్ ను ప్రభుత్వం వెంటనే పునర్నిర్మించాలి రైతులను మత్స్యకారులను బతికించాలి తాపీ పట్టి బేల్దారిగా మారిన మాజీ తలారి రంగయ్య

పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ...

Select Suryaa Now
పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ...

*పారిశుద్ధ్య కార్మికులకు మార్వాడి సమాజం అండ* 

 *దీపావళి సందర్భంగా దుస్తుల పంపిణీ* 

 *కార్మికుల సేవలు వెలకట్టలేనివి* 

 *షాద్‌నగర్ ఎసిపి లక్ష్మీనారాయణ* 

 *మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్* 

పండుగల ఆనందం ప్రతి కుటుంబంలో వెల్లివిరియాలనే సదుద్దేశంతో షాద్‌నగర్ రాజస్థాన్ మార్వాడి సమాజం సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని షాద్‌నగర్ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ సీతారాం హాజరై కార్మికులకు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకమన్నారు. ఎండ, వాన, చలి వంటి వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా ప్రతిరోజూ విధులు నిర్వర్తిస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు వారు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను సమాజం గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

ఏసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దసరా, దీపావళి వంటి పర్వదినాల్లో కార్మికులను గుర్తించి వారికి దుస్తులు అందజేయడం అభినందనీయమన్నారు. సమాజం కోసం నిరంతరం శ్రమించే కార్మికులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు పరస్పర గౌరవం, సోదరభావం, సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. రాజస్థాన్ మార్వాడి సమాజం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్య కార్మికుల కృషిని గుర్తించి, పండుగ వేళ వారి కుటుంబాల్లోనూ ఆనందాన్ని నింపే ప్రయత్నం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా మానవీయ విలువలను పెంపొందించడంతో పాటు సమాజంలోని వివిధ వర్గాల మధ్య స్నేహభావాన్ని పెంచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సి. పెంటయ్య, రాజు నాయక్, అశోక్, పి. గోపాల్, మనీష్, రాజస్థాన్ మార్వాడి సమాజ ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

జవాజి రాఘవేంద్ర గౌడ్ మేజర్ న్యూస్ షాద్ నగర్