BREAKING
తుఫాను వేళ ఉయ్యూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చేనేత కుటుంబాల సంక్షేమమే లక్ష్యం.. నేతన్నలకు అండగా ఉంటా స్వతంత్ర అభ్యర్థి డి. నజీర్ అహ్మద్ మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలూ కరువు జాబితాలో ఉండటం బాధాకరం: బిఆర్ఎస్ రాష్ట్ర నాయకు రాలు పాల్వాయి స్రవంతి రెడ్డి రజినీకాంత్ ధర్మన్ మూవీ ఓటీటీ డీల్ రూ.150 కోట్లు నిజమేనా దుబాయ్‌లో ఘనంగా యూఏఈ కౌండిన్య సేన (గౌడ బంధువుల) దసరా సంబరాలు గేమ్ ఛేంజర్ కథపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సంచలన వ్యాఖ్యలు.. అసలు మేటర్ ఇదే! సినిమా ట్విస్ట్‌పై దర్శకుడు పూర్వాజ్ సంచలన కామెంట్స్.. రాజమౌళి వ్యాఖ్యలపై స్పష్టత! తుపాను ప్రభావంతో జాతీయ సదస్సు వాయిదా కొండ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలే తప్ప అభివృద్ధి జరగలేదు...ఎంపీ బస్తిపాటి నాగరాజు కల్వల ప్రాజెక్ట్ ను ప్రభుత్వం వెంటనే పునర్నిర్మించాలి రైతులను మత్స్యకారులను బతికించాలి తాపీ పట్టి బేల్దారిగా మారిన మాజీ తలారి రంగయ్య మఠాధిపతి నియామకం. ప్రతిభా చాటిన విద్యార్థులను సన్మానించిన మాజీ మంత్రి హరీష్ రావు పత్తి దిగుబడి భారీగా తగ్గింది.. ఝరాసంగం మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి.

ఉద్రిక్తతగా మారిన మూసీ ప్రాజెక్టు సమావేశం!

Select Suryaa Now
ఉద్రిక్తతగా మారిన మూసీ ప్రాజెక్టు సమావేశం!

బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి అరెస్ట్

గండిపేట , మేజర్ న్యూస్ (అక్టోబర్ 28) :మూసీ ప్రాజెక్టు ప్రభావిత ప్రజలతో రాజేంద్రనగర్‌లోని వాలంటరీ వద్ద ఎంఆర్డీసీఎల్ అధికారులు నిర్వహించిన సంప్రదింపుల సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. సమావేశానికి బాధితులను మాత్రమే అనుమతించడంపై బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశానికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు, ప్రతిపాదనలను అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బాధితులకు వివరించారు. సమావేశం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షలు, బీఆర్ఎస్ నాయకుల అభ్యంతరాలతో రాజేంద్రనగర్‌లో చోటుచేసుకున్న పరిణామాలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి.