వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలే తప్ప అభివృద్ధి జరగలేదు...ఎంపీ బస్తిపాటి నాగరాజు
కర్నూలు మేజర్ న్యూస్:
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలే తప్ప ఎలాంటి అభివృద్ధి చెందలేదని ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆరోపించారు...కార్పొరేషన్ పరిధిలోని 52 వ వార్డులో గల మామిదలపాడు, 51 వ వార్డులోని ఎల్.పేట లో కోడుమూరు ఎం.ఎల్.ఏ బొగ్గుల దస్తగిరి తో కలిసి ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు..ఈ సందర్భంగా ఎంపీ ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ గొడ్డలి పార్టీ అరాచక పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని విధాలుగా అభివృద్ధి చేసిందన్నారు.. ఇక గత ప్రభుత్వం కార్పొరేషన్ నిధులను మళ్ళించి వార్డుల అభివృద్ధిని గాలికి వదిలేసిందని, వార్డుల్లో అభివృద్ధి చెందాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ కోరారు...ఈ కార్యక్రమంలో టీడీపీ మేయర్ అభ్యర్థి విజయ ప్రత్యూష, కార్పొరేటర్ అభ్యర్థులు రమేష్, ఓబులేసు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..