నిజాంపట్నం-రేపల్లె రోడ్డులో చెట్టు తొలగింపు
నగరం, మేజర్ న్యూస్:
తుఫాను కారణంగా స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపట్నం-రేపల్లె రోడ్డు మధ్య చెట్టు పడిపోగా, వెంటనే స్పందించిన ఎస్సై చెన్నకేశవులు తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డుగా పడిన చెట్టు కొమ్మలను తొలగించి, రహదారిపై ట్రాఫిక్కు ఎలాంటి ఆటంకం లేకుండా చేశారు. ఈ సందర్భంగా ఎవరికీ ఎలాంటి గాయాలు గానీ, ఆస్తి నష్టం గానీ లేదని ఆయన అన్నారు.