BREAKING
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ పేదల నివాసాల కూల్చివేతపై రాజకీయమా..! కార్తీక మాసంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు దుర్గమ్మను దర్శించుకున్న సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు యువతలో నాయకత్వ లక్షణాలకు యూత్ పార్లమెంట్ పోటీలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ డీకే బాలాజీ జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నగర పోలీస్ కమిషనర్ నివాళులు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసుల విస్తృత తనిఖీలు ఆజాద్ ఆశయాలతో విద్యారంగ అభివృద్ధికి లోకేష్ కృషి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం చందర్లపాడు మండల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా : ఎంపీ కేశినేని చిన్ని విజయవాడకు మరోసారి జాతీయస్థాయి స్వచ్ఛత పురస్కారం కృష్ణా జడ్పీ పీఠంపై ఉత్కంఠ! ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హోటళ్లు, ఆహార సంస్థలు పనిచేయాలి

చేతికొచ్చిన పంట.. కళ్ల ముందే నేలమట్టం

Select Suryaa Now
చేతికొచ్చిన పంట.. కళ్ల ముందే నేలమట్టం

నెలల తరబడి కష్టపడి.. అప్పులు చేసి.. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట. కోతకు వారం రోజులే ఉందనగా ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులు రైతన్న ఆశలను నేలమట్టం చేశాయి.

వర్షం కంటే ఈసారి వీచిన బలమైన గాలులే పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి. వరి పంట పొలాల్లోనే నేలకొరిగింది. కొబ్బరి చెట్లు విరిగిపోయాయి. ఎటు చూసినా దెబ్బతిన్న పంటలు, నేలపై పడిపోయిన కంకులు, రైతుల కన్నీళ్లే కనిపిస్తున్నాయి.

“ఇంత కష్టపడ్డాక కూడా ఇదేనా మా బతుకు?” అంటూ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఒకటి రెండు గ్రామాల పరిస్థితి మాత్రమే కాదు.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అనేక గ్రామాల్లో ఇదే దుస్థితి కనిపిస్తోంది. చేతికొచ్చే సమయంలో పంట దెబ్బతినడంతో రైతులపై పెట్టుబడి నష్టం, అప్పుల భారం మరింత పెరిగింది.

ఇది కేవలం పంట నష్టం కాదు.. రైతు కుటుంబం ఏడాది భవిష్యత్తుపై పడిన దెబ్బ.

ప్రభుత్వమే ఆదుకోవాలి

పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి రైతులకు తగిన పరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు. పంట బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, ఇతర ప్రభుత్వ సహాయాలను వేగంగా అందించి రైతుల కష్టాల్లో అండగా నిలవాల్సిన అవసరం ఉంది.

రైతు కంట కన్నీరు రాకుండా చూడాల్సిన సమయం కాదు.. ఇప్పటికే వచ్చిన కన్నీటిని తుడవాల్సిన సమయం ఇది.