కొండ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
విజయవాడ క్రైం, మేజర్ న్యూస్: అర్నబ్ తుపాను నేపథ్యంలో కొండ ప్రాంతాల ప్రజల భద్రతకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాల మేరకు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండ ప్రాంతాలను సందర్శించిన పోలీసులు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. కొండ ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ పోలీసుల సూచనలు పాటించాలని, తమ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులు కోరారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.