BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి వైసీపీ నేతల సవాల్ ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు**వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేడుకలకు హాజరైన అభిమానులు**కేక్ కటింగ్‌తో పాటు తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహణ* ఆర్నబ్‌ తుఫాను దెబ్బ.. 81,350 హెక్టార్లలో పంట నష్టం డ్రగ్స్ వాడకంతో నష్టాలపై సమన్వయంతో వివరించాలి.. కలెక్టర్, ఎస్పీ నార్కోటిక్ కంట్రోల్ సమావేశం. పాక్‌ గడ్డపై లంక పేసర్ సంచలనం.. 30 ఏళ్ల ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు! తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆక్లాండ్‌కు చేరిన టీమిండియా.. జట్టును వీడిన కుశాగ్ర! కత్తెర గుర్తుతో కొరివి శ్రీకాంత్ ప్రచారం ప్రారంభం ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం ఎల్‌నినో పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి విద్యార్థినుల కోసం ‘కూల్ అండ్ హాట్ వాటర్ ఫిల్టర్’ అందజేత నాగారంలో బీజేపీ బూత్ కమిటీ నియామకం చల్లపల్లి-విజయవాడ రోడ్డుపై విరిగిపడిన చెట్లు తొలగింపు కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర ప్రారంభం తుఫాన్ బాధితులకు అండగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన ఉన్నత అధికారులు

చేనేత కుటుంబాల సంక్షేమమే లక్ష్యం.. నేతన్నలకు అండగా ఉంటా స్వతంత్ర అభ్యర్థి డి. నజీర్ అహ్మద్

Select Suryaa Now
చేనేత కుటుంబాల సంక్షేమమే లక్ష్యం.. నేతన్నలకు అండగా ఉంటా  స్వతంత్ర అభ్యర్థి డి. నజీర్ అహ్మద్

ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి:చేనేత కుటుంబాల సంక్షేమం, నేతన్నల అభ్యున్నతి, పట్టణ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ స్వతంత్ర అభ్యర్థి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని శివన్న నగర్, అబ్బాస్ టాకీస్, ఎన్టీఆర్ కాలనీలలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా చేనేత కార్మికులను, నేతన్న కుటుంబాలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేనేత రంగం ఎన్నో కుటుంబాలకు జీవనాధారమని, తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయ వృత్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, ఉపాధి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. నేతన్నల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, మున్సిపాలిటీ పరిధిలో పరిష్కరించగల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.చేనేత కుటుంబాల సంక్షేమం, నేతన్నల గౌరవం, వారి పిల్లల భవిష్యత్తు, కాలనీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకుడిగా నిలుస్తానని స్పష్టం చేశారు.రానున్న ఎన్నికల్లో చేనేత కుటుంబాలు, పట్టణ ప్రజలు తనకు మద్దతుగా నిలిచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించాలని డి. నజీర్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. నేతన్నల సంక్షేమం, ప్రజల అభ్యున్నతి, ఎమ్మిగనూరు పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
A. R. శరత్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా