చింతకుంట చెరువు పరిరక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలి
సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల మున్సిపల్ పరిధిలోని చింతకుంట చెరువు పరిరక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించి, తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ మున్సిపల్, నీటిపారుదల శాఖల అధికారులతో కలిసి చింతకుంట చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు ప్రస్తుత పరిస్థితి, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, సంబంధిత అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చెరువు పరిరక్షణకు అవసరమైన సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసి, చెరువు స్థలాన్ని కాపాడేందుకు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి వో మధుసూదన్‌తో పాటు మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.