పొగాకుకు దూరంగా ఉండాలి.
నవాబుపేట సూర్య న్యూస్: పొగాకు వినియోగంతో ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ కుమార్ అన్నారు.బుధవారం పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ..పొగాకు వినియోగం వల్ల నోటి క్యాన్సర్‌తో పాటు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపారు.పొగతాగడం,గుట్కా,ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులను వినియోగించడం ఆరోగ్యానికి హానికరమని పేర్కొన్నారు.యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని,పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని పూర్తిగా మానుకోవాలని సూచించారు.పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు.అనంతరం పొగాకు ఉత్పత్తులను వినియోగించబోమని,ఇతరులకు కూడా వాటి దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది,ప్రజలు పాల్గొన్నారు.