పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.. రక్తదానం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు
చేవెళ్ల: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చేవెళ్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని కేజీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రక్తదానం చేశారు. ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. రక్తదానం గొప్ప సామాజిక సేవా కార్యక్రమమని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి రక్తదానం చేయడం ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. అన్ని దానాల్లో రక్తదానం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత సామాజిక స్పృహ కలిగి ఉండాలని, మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ రక్తదాన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ చేవెళ్ల మండల కార్యదర్శి మాల చందు, శ్రీనివాస్, నాగేష్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.