రుద్రంపల్లి నుండి వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభం*
జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు శ్రీదేవిసుదర్శన్ రెడ్డి,లక్ష్మీదేవిలు బుధవారం ప్రత్యేకపూజలు చేసి ఎన్నికల ప్రచారం పారంభం చేశారు. స్థానిక ఎన్నికల భాగంగా మండలానికి దేవమూలఐన రుద్రంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొదటిరోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలుచేసిన సంక్షేమపథకాలు,చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకువివరిస్తూ పార్టీ అభ్యర్థులకు మద్దతు కోరారు. ఈసందర్భంగా జడ్పీటీసీ అభ్యర్థి ఎస్.కె. శ్రీదేవి సుదర్శన్‌రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి కురుబ లక్ష్మీదేవి ప్రజలను కలిసి తమకు మద్దతు తెలిపి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీనాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేదాం అన్నారు.పిలుపు నిచ్చారు. గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ వైసీపీగతంలో నిర్వహించిన సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని సూచించారు. జడ్పీటీసీతో పాటు అన్ని ఎంపీటీసీ స్థానాలను భారీ మెజార్టీతో గెలుపుకోసం పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు,కార్యకర్తలు, అనేకమంది ప్రజలు పాల్గొన్నారు.