BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి వైసీపీ నేతల సవాల్ ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు**వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేడుకలకు హాజరైన అభిమానులు**కేక్ కటింగ్‌తో పాటు తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహణ* ఆర్నబ్‌ తుఫాను దెబ్బ.. 81,350 హెక్టార్లలో పంట నష్టం డ్రగ్స్ వాడకంతో నష్టాలపై సమన్వయంతో వివరించాలి.. కలెక్టర్, ఎస్పీ నార్కోటిక్ కంట్రోల్ సమావేశం. పాక్‌ గడ్డపై లంక పేసర్ సంచలనం.. 30 ఏళ్ల ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు! తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆక్లాండ్‌కు చేరిన టీమిండియా.. జట్టును వీడిన కుశాగ్ర! కత్తెర గుర్తుతో కొరివి శ్రీకాంత్ ప్రచారం ప్రారంభం ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం ఎల్‌నినో పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి విద్యార్థినుల కోసం ‘కూల్ అండ్ హాట్ వాటర్ ఫిల్టర్’ అందజేత నాగారంలో బీజేపీ బూత్ కమిటీ నియామకం చల్లపల్లి-విజయవాడ రోడ్డుపై విరిగిపడిన చెట్లు తొలగింపు కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర ప్రారంభం తుఫాన్ బాధితులకు అండగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన ఉన్నత అధికారులు

తుఫాను వేళ ఉయ్యూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
తుఫాను వేళ ఉయ్యూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఉయ్యూరు, మేజర్ న్యూస్: తుఫాను ప్రభావం నేపథ్యంలో ఉయ్యూరు మున్సిపాలిటీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి పినమాల నాగ కుమార్ విజ్ఞప్తి చేశారు. రాబోయే రెండు మూడు రోజులకు సరిపడా పాలు, కూరగాయలు, తాగునీరు, నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. మొబైల్ ఫోన్లు, పవర్ బ్యాంకులను ముందుగానే ఛార్జింగ్ చేసుకోవాలని, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి అత్యవసర సేవలను సిద్ధం చేయాలని, ప్రజల సహాయార్థం 24 గంటల హెల్ప్‌లైన్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర మందులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలను వెంటనే స్థానిక అధికారులకు లేదా తన కార్యాలయానికి తెలియజేయాలని, అందరూ కలిసికట్టుగా తుఫాను ముప్పును ఎదుర్కొందామని పినమాల నాగ కుమార్ పిలుపునిచ్చారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.