జడ్పీటీసీ చైర్మన్ రేసులో తాతినేని ప్రవళి
పమిడిముక్కల, మేజర్ న్యూస్: పమిడిముక్కల జడ్పీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తాతినేని ప్రవళి ఎన్నికల బరిలో నిలిచారు. జడ్పీటీసీ చైర్మన్ రేసులోనూ ఆమె పేరు వినిపిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచి, తనను ఆశీర్వదించి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. “అభివృద్ధికే ఓటు” అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని తాతినేని ప్రవళి పేర్కొన్నారు. న్యాయవాదిగా ప్రజల సమస్యలపై తనకు అవగాహన ఉందని, ఆ అనుభవాన్ని ప్రజాసేవకు ఉపయోగిస్తానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యం ఇస్తానన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, పమిడిముక్కల మండలంతో పాటు జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తానని ఆమె వెల్లడించారు. కూటమి ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు తనకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పామర్రు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.