BREAKING
'ఓఎమ్' చిత్రంలో ఐపీఎస్ నిత్యా రెడ్డిగా సాయి పల్లవి ఓటు హక్కును కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు : బిజెపిపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శలు స్థానిక ఎన్నికలకు టీడీపీ సై.. అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన మాలకొండయ్య..! నటి సునైనా ఏఐ వీడియో వివాదం రైతుల అభివృద్ధికి ఎఫ్‌పీవోలే వేదిక 25 ఏళ్ల తర్వాత 'లగాన్' నటి సందడి! వెలింగ్టన్‌లో మూడో టీ20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ వచ్చే ఏడాది డిసెంబర్‌ లోగా 550 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి - నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ పాటిల్‌ అక్షయ్ కుమార్ సినిమాపై కొత్త కండిషన్స్ 'మిషన్ కాశ్మీర్ ' జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న సోనాలి కులకర్ణి దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25% ఏపీకే.. ప్రియాంక 'దివాలీవిన్' వేడుకలు 8వ వార్డులో జనసేన అభ్యర్థి మురాదు విస్తృత ప్రచారం గొట్టిపాటి లక్ష్మి కృషితో తొలిసారి తాళ్లూరు ఎంపీపీ పీఠాన్ని దక్కించుకున్న టిడిపి. గుంటూరు: కార్పొరేషన్ ఎన్నికల ప్రచార సందడి

మన నగరం.. మన మనిషి.. మన మేయర్‌ అభ్యర్థి!

Select Suryaa Now
మన నగరం.. మన మనిషి.. మన మేయర్‌ అభ్యర్థి!

పక్కా లోకల్‌ ముక్కా శ్రావణికి కాపు సేన సంపూర్ణ మద్దతు
....
విశాఖ ప్రజల కష్టాలు తెలిసిన నాయకత్వం నగరాభివృద్ధికి అవసరం: బి.ఎన్‌.మూర్తి
....
విశాఖపట్నం: నగరం అంటే కేవలం రోడ్లు, భవనాలు, కూడళ్లు మాత్రమే కాదు.. ఇక్కడి ప్రజల జీవన విధానం, వారి కష్టాలు, వారి ఆశలు, ఆకాంక్షల సమాహారం. ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉందో, సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవాలంటే ఆ నగరంతో అనుబంధం ఉండాలని కాపు సేన రాష్ట్ర అధ్యక్షుడు బి.ఎన్‌.మూర్తి అన్నారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కూటమి మేయర్‌ అభ్యర్థి ముక్కా శ్రావణికి కాపు సేన తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

“మన నగరాన్ని అర్థం చేసుకునే మనిషి.. మన ప్రజల సమస్యలను వినగలిగే నాయకత్వం అవసరం” అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన బి.ఎన్‌.మూర్తి, ముక్కా శ్రావణి స్థానిక అభ్యర్థి కావడం ఆమెకు నగర పరిస్థితులపై అవగాహన ఉండటానికి కీలకమైన అంశమని పేర్కొన్నారు. స్థానికత అంటే కేవలం ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం మాత్రమే కాదని, ఆ ప్రాంత ప్రజల జీవన వాస్తవాలను అర్థం చేసుకోవడం, వారి అవసరాలను గుర్తించడం, వారి ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా అని వివరించారు.

విశాఖపట్నం ప్రజలు మెరుగైన రహదారులు, స్వచ్ఛమైన పరిసరాలు, నిరంతర తాగునీటి సరఫరా, మెరుగైన పారిశుధ్యం, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ వంటి ఎన్నో మౌలిక సదుపాయాలను ఆశిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నగరంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి.. ప్రతి కుటుంబానికి మెరుగైన జీవన పరిస్థితులు అందాలి.. సామాన్యుడి సమస్యకు పాలనలో ప్రాధాన్యం లభించాలి అన్నదే నిజమైన నగరాభివృద్ధి లక్ష్యం కావాలని అన్నారు.

“మన ప్రాంతం గురించి తెలిసినవారికి మన సమస్యలు చెప్పుకోవడం సులభం. మన ప్రజల అవసరాలను అర్థం చేసుకునే నాయకత్వం ఉంటే అభివృద్ధి లక్ష్యాలను మరింత స్పష్టంగా ముందుకు తీసుకెళ్లవచ్చు” అని బి.ఎన్‌.మూర్తి అభిప్రాయపడ్డారు.

విశాఖపట్నం అభివృద్ధి చెందడం అంటే నగర ప్రజల భవిష్యత్తు మెరుగుపడటమేనని, స్థానిక అవసరాలకు తగిన ప్రాధాన్యం లభించినప్పుడే అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరువవుతాయని ఆయన పేర్కొన్నారు. నగరంపై అవగాహన, స్థానిక సమస్యలపై పట్టింపు, ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యం వంటి అంశాలు నగర పాలనలో ముఖ్యమని తెలిపారు.

ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని జీవీఎంసీ కూటమి మేయర్‌ అభ్యర్థి ముక్కా శ్రావణికి కాపు సేన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు బి.ఎన్‌.మూర్తి వెల్లడించారు.