గొట్టిపాటి లక్ష్మి కృషితో తొలిసారి తాళ్లూరు ఎంపీపీ పీఠాన్ని దక్కించుకున్న టిడిపి.
40ఏళ్ల టిడిపి కల సహకారమైన వేళ.
తాళ్లూరు ఎంపీపీ టిడిపి కైవసం.
14 ఎంపీటీసీ స్థానాలు టిడిపికి ఏకగ్రీవం.
తాళ్లూరు మండలంలో 40 సంవత్సరాల తర్వాత తొలి పర్యాయం ఎంపీపీ పీఠం దక్కించుకుంటున్న టిడిపి.
సూర్య న్యూస్ తాళ్లూరు. మండల వ్యవస్థ ఏర్పడిన తొలిసారి తాళ్లూరు ఎంపీపీ పీఠాన్ని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కృషితో టిడిపి కైవాసం చేసుకుంది. 40 ఏళ్ల తర్వాత టిడిపి చిరకాల కల సహకారమైంది. మండలంలోని 14 ఎంపీటీసీలలో టిడిపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎడమ కంటి గురవారెడ్డి ఎంపీపీగా ఎన్నికయ్యారు. మూల సుబ్బారెడ్డి పోసాం మధుసూదనారెడ్డి, వసంత, మోసే, తాడికొండ శ్రీనివాసరావు ఎంపీపీగా పని చేశారు. వీరందరూ కాంగ్రెస్, వైసిపి పార్టీలకు చెందిన వారే. నియోజకవర్గంలో టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కృషితో తాళ్లూరు ఎంపీపీ పీఠం టిడిపి వశం అయింది. 40 ఏళ్ల టిడిపి కల గొట్టిపాటి లక్ష్మీ కృషితో సహకారమైందని టిడిపి శ్రేణులు ఆనందోత్సవాలలో మునిగితేలుతున్నారు.