శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు....
విజయనగరం మేజర్ న్యూస్:
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని ఆలయ అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు మంగళవారం సతీసమేతంగా దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటాన్ని అందజేసి అమ్మవారి వేదాశీర్వచనం అందించారు.
కార్యక్రమంలో ఆలయ ఈవో శిరీష, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.