కొమురం భీమ్ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే పాయం
మణుగూరు ఆర్ సి సూర్య ; ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా మంగళవారం మణుగూరు అంబేద్కర్ సెంటర్‌లో ఆయన విగ్రహానికి పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొమురం భీమ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని, ఆయన ‘జల్–జంగల్–జమీన్’ నినాదం తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పిరినాకి నవీన్, టౌన్ అధ్యక్షుడు కురం రవి ముదిరాజ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా