BREAKING
జస్టిస్ సామ్ కోషికి ఢిల్లీ పగ్గాలు.. కొలీజియం కీలక నిర్ణయం శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి.. ముండ్లమూరు జడ్.పి.టి. సి టిడిపి అభ్యర్థిగా మందలపు సౌమ్య. సరిహద్దుల్లో మా గస్తీ సాధారణమే.. శాంతి కోసం భారత్‌ కలిసి పనిచేయాలి: భారత్ ఆరోపణలను తోసిపుచ్చుతూ చైనా ప్రకటన! శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు.... విద్యుత్ షాక్‌తో 17 ఏళ్ల యువకుడు మృతి.. పర్దీపురం గ్రామంలో తీవ్ర విషాదం* మూడు మండలాల్లో కూటమిదే ఆధిక్యం.. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ధీమా నేల ఆరోగ్య పరిరక్షణకు ‘ఖేత్ బచావో అభియాన్’ అబుదాబి ఎయిర్ పోర్టులో ఎలికట్టవాసి రజియా మృతి మన నగరం.. మన మనిషి.. మన మేయర్‌ అభ్యర్థి! జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో శ్రీ పైడితల్లమ్మకు సారె సమర్పణ.. అమ్మవారి ఆశీస్సులు అందరి పై ఉండాలి ....హోంమంత్రి అనిత యూఎన్‌ఎస్‌సీలో అందరికీ వీటో ఉండాల్సిందే: భారత్ డిమాండ్ ఏపీ స్థానిక ఎన్నికలపై కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ.. జడ్పీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపు

Select Suryaa Now
పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి :  ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపు

దుండిగల్ మేజర్ న్యూస్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ శాసనసభాపక్ష విప్ కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై గండిమైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు పురోగతిపై సమీక్షించి, అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. గతంలో ఉన్న పట్టభద్రుల ఓటరు జాబితాలను పరిశీలించి, అర్హులైన వారి వివరాలను సేకరించాలని నాయకులకు సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియకు నవంబర్ 6 చివరి తేదీ కావడంతో సమయం వృథా చేయకుండా క్షేత్రస్థాయిలో కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి అర్హుడికి సమాచారం చేరవేసి, ఎవరూ ఓటు హక్కు పొందే అవకాశాన్ని కోల్పోకుండా సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు బాధ్యతతో పనిచేయాలని శంభీపూర్ రాజు, కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకు సాగుతూ పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.