BREAKING
'జైలర్ 2'పై చేతన్ డిసౌజా కామెంట్స్ చీరాల సముద్రం అల్లకల్లోలం.. ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో చీరాల సముద్రం అల్లకల్లోలంగా మారింది. వాడరేవు, రామాపురం, కటారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం తీరాల్లో అలలు ఎగసిపడుతున్నాయి. అధికారులు ఇప్పటికే వేటను నిషేధించడంతో పాటు బీచ్‌లను మూసివేసి పర్యాటకులకు అనుమతి నిరాకరించారు. మంగళ, బుధవారాల్లో తుఫాన్ ప్రభావం త కొమురం భీమ్ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే పాయం 26, 27వ వార్డుల్లో టీడీపీ అభ్యర్థుల తరఫున గిరిధర్ ప్రచారం పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ... జడ్పీటీసీ చైర్మన్‌ రేసులో తాతినేని ప్రవళి ప్రజాపాలనలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఎంపీ మల్లు రవితో కాంగ్రెస్ కార్యకర్తల భేటీ... ఎన్నికల్లో ఓడిపోతే నెతన్యాహు జైలుకు వెళ్లాల్సిందేనా? ఇజ్రాయెల్ ప్రధాని ముందున్న చట్టపరమైన సవాళ్లు ఇవే! ఆఫ్రికా తీరంలో సముద్రంలో మునిగిపోయిన భారీ ఆయిల్ రిగ్.. భారతీయుడు మృతి, మరో నలుగురు గల్లంతు! జస్టిస్ సామ్ కోషికి ఢిల్లీ పగ్గాలు.. కొలీజియం కీలక నిర్ణయం శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి.. ముండ్లమూరు జడ్.పి.టి. సి టిడిపి అభ్యర్థిగా మందలపు సౌమ్య. సరిహద్దుల్లో మా గస్తీ సాధారణమే.. శాంతి కోసం భారత్‌ కలిసి పనిచేయాలి: భారత్ ఆరోపణలను తోసిపుచ్చుతూ చైనా ప్రకటన! శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు....

మద్యం మత్తులో మున్సిపల్ అధికారి హల్‌చల్‌..! దాబాలో శానిటేషన్ డీఈ వీరంగం సృష్టించారంటూ ఆరోపణలు

Select Suryaa Now
మద్యం మత్తులో మున్సిపల్ అధికారి హల్‌చల్‌..!  దాబాలో శానిటేషన్ డీఈ వీరంగం సృష్టించారంటూ ఆరోపణలు

కొంపల్లి, మేజర్ న్యూస్ :: ప్రజలకు సేవలందించాల్సిన మున్సిపల్ అధికారే మద్యం మత్తులో దాబా నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారనే ఆరోపణలు కొంపల్లి సర్కిల్‌లో కలకలం రేపుతున్నాయి. కొంపల్లి శానిటేషన్ డీఈ తిరుపతి ఆదివారం రాత్రి తన సహచరులు రాఘవచారి, ప్రవీణ్‌లతో కలిసి స్థానిక ఫ్రెండ్స్ దాబాకు వెళ్లినట్లు సమాచారం. ఆర్డర్ చేసిన బటర్ మసాలా అందుబాటులో లేదని నిర్వాహకులు చెప్పడంతో ఆగ్రహానికి గురైన అధికారి, 'నేను కొంపల్లి డీఈని.. నీ దాబా ఎలా నడుస్తుందో చూస్తా' అంటూ బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారానికి మూడుసార్లు వచ్చి ఉచితంగా తినడమే కాకుండా తమపైనే బెదిరింపులకు దిగుతారా అంటూ దాబా నిర్వాహకులు నిలదీసినట్లు తెలుస్తోంది.

వివాదం తీవ్రరూపం దాల్చడంతో నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించగా, వ్యవహారం పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరినట్లు సమాచారం. సదరు అధికారికి నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది. ఉద్యోగానికి ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతో రాజీ కుదుర్చుకున్నట్లు స్థానికంగా చర్చ సాగుతోంది.

మరోవైపు సదరు అధికారి విధుల్లోనూ మద్యం మత్తులో ఉంటారని, కిందిస్థాయి సిబ్బందితో బీరు బాటిళ్లు తెప్పించుకుంటారని, నిరాకరిస్తే ఉద్యోగాలు తొలగిస్తామంటూ బెదిరిస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కక్షసాధింపు చర్యలకు భయపడి బహిరంగంగా ఫిర్యాదు చేయలేకపోతున్నామని కొందరు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ అధికారుల ప్రవర్తనపై ఫిర్యాదులు చేసినట్లు స్థానిక నాయకులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు రుజువైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.