అబుదాబి ఎయిర్ పోర్టులో ఎలికట్టవాసి రజియా మృతి
షాద్ నగర్ ….
అబుదాబి ఎయిర్పోర్టులో ఎలికట్ట వాసి రజియా బేగం మృతి
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజవర్గం ఫరూక్ నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామానికి చెందిన రజియా బేగం షాద్ నగర్ పట్టణంలోని ప్యారడైజ్ కాలనీలో నివాసం ఉంటుంది . కాగా రజియా బేగం ఉమ్రా యాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా అబుదాబి ఎయిర్పోర్టులో మృతి చెందారు. జెడ్డా నుంచి విమానంలో అబుదాబి చేరుకుని హైదరాబాద్ కనెక్టింగ్ ఫ్లెట్ ఎక్కేలోపు ఈ విషాదం జరిగింది. మృతదేహాన్ని హైదరాబాద్ కు రప్పించేందుకు భారత రాయబార కార్యాలయం స్పందించాలని, విదేశాంగ మంత్రి జైశంకర్ జోక్యం చేసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.
జవ్వాజి రాఘవేందర్ గౌడ్ మేజర్ న్యూస్