ఆల్వాల్ మచ్చబోల్లారం డివిజన్ లో ఘనంగా మహర్షి వాల్మీకి వేడుకలు.
హైదరాబాద్ /ఆల్వాల్, మేజర్ న్యూస్ : ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఆల్వాల్ సర్కిల్, మచ్చబోల్లారం డివిజన్ లోని అంబెడ్కర్ నగర్, వజ్ర ఎంక్లేవ్ సమీపంలో లోని అంబెడ్కర్ వాల్మీకి జయంతి వేడుకలను సోమవారం బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బి. జె. పి. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె. శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు.బిజెపి మేడ్చల్ ---మల్కాజ్గిరి అర్బన్ జిల్లా కార్యదర్శి రవి శేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా శ్రీనివాస్ వర్మా మాట్లాడుతూ మహర్షి వాల్మీకి రామాయణ మహా కావ్యాన్ని రచించి, భారతీయ సంస్కృతీ, ఆధ్యాత్మికతకు అపారమైన సేవలాందించిన మహార్షి వాల్మీకి జీవితం.ఆయన భోదనలు, మనందరికీ స్ఫూర్తి దాయకం, ఆయన భోదనాలలోని సారాంషాన్ని గ్రహించి, వాటిని స్మరించుకుంటూ ధర్మం, సత్యం, సమానత్వం విలువలను అందించడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి.ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు అజయ్ రెడ్డి.,కార్తీక్ గౌడ్,అనిల్,రాష్ట్ర ఎస్సీ మోర్చా మీడియా కన్వీనర్ పద్మిని,రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షురాలు త,మేడ్చల్–మల్కాజిగిరి ధార్మిక సెల్ కో-కన్వీనర్ ఉష,వినయ్,అవినాష్,అజిత్,కిరణ్ ,వంశీ,కృష్ణకుమారి,కె. శ్రీకాంత్,దశరథ్,నాగమణి తో పాటు ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహర్షి వాల్మీకి కి ఘనంగా నివాళులర్పించారు.