అమ్మవారి ఆశీస్సులు అందరి పై ఉండాలి ....హోంమంత్రి అనిత
విజయనగరం మేజర్ న్యూస్:
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా ప్రజలందరికీ
జిల్లా ఇన్‌చార్జి మంత్రి, హోంమంత్రి వంగలపూడి అనిత శుభాకాంక్షలు తెలిపారు.
విజయనగరం చారిత్రక, ఆధ్యాత్మిక వైభవానికి, సంస్కృతికి ప్రతీక అన్నారు.
ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు
విజయనగరం ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి కరుణాకటాక్షాలు అందరికీ అందాలని కోరుకుంటునన్నారు.
సిరిమానోత్సవం భక్తి, సంప్రదాయాలు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందనీ
పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని హోం మంత్రి అనిత ఆకాంక్షించారు.