BREAKING
జస్టిస్ సామ్ కోషికి ఢిల్లీ పగ్గాలు.. కొలీజియం కీలక నిర్ణయం శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి.. ముండ్లమూరు జడ్.పి.టి. సి టిడిపి అభ్యర్థిగా మందలపు సౌమ్య. సరిహద్దుల్లో మా గస్తీ సాధారణమే.. శాంతి కోసం భారత్‌ కలిసి పనిచేయాలి: భారత్ ఆరోపణలను తోసిపుచ్చుతూ చైనా ప్రకటన! శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు.... విద్యుత్ షాక్‌తో 17 ఏళ్ల యువకుడు మృతి.. పర్దీపురం గ్రామంలో తీవ్ర విషాదం* మూడు మండలాల్లో కూటమిదే ఆధిక్యం.. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ధీమా నేల ఆరోగ్య పరిరక్షణకు ‘ఖేత్ బచావో అభియాన్’ అబుదాబి ఎయిర్ పోర్టులో ఎలికట్టవాసి రజియా మృతి మన నగరం.. మన మనిషి.. మన మేయర్‌ అభ్యర్థి! జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో శ్రీ పైడితల్లమ్మకు సారె సమర్పణ.. అమ్మవారి ఆశీస్సులు అందరి పై ఉండాలి ....హోంమంత్రి అనిత యూఎన్‌ఎస్‌సీలో అందరికీ వీటో ఉండాల్సిందే: భారత్ డిమాండ్ ఏపీ స్థానిక ఎన్నికలపై కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ.. జడ్పీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని

డీఎల్‌ఎఫ్‌ రహదారి మరో 90 రోజులు మూసివేత ;నేటి నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు

Select Suryaa Now
 డీఎల్‌ఎఫ్‌ రహదారి  మరో 90 రోజులు మూసివేత ;నేటి నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు

గచ్చిబౌలి,మేజర్ న్యూస్ : గచ్చిబౌలి పరిధిలోని డీఎల్‌ఎఫ్‌ గేట్‌ నంబర్‌ 1 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు రహదారి మూసివేతను మరో 90 రోజులపాటు పొడిగిస్తూ సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఫ్లైఓవర్‌, అండర్‌పాస్‌ నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ నెల 27 నుంచి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. నిర్మాణ పనుల పురోగతి, అందుబాటులో ఉన్న రహదారి స్థలాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో దశలవారీగా వాహనాల రాకపోకలకు అనుమతించనున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలివీ.....
రాడిసన్‌ హోటల్‌ నుంచి ఐఐఐటీ జంక్షన్‌కు: రాడిసన్‌ హోటల్‌ వైపు నుంచి డీఎల్‌ఎఫ్‌ మీదుగా ఐఐఐటీ జంక్షన్‌కు వెళ్లే వాహనాలను డీఎల్‌ఎఫ్‌ గేట్‌ నంబర్‌ 1 వరకు మాత్రమే అనుమతిస్తారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లేందుకు అనుమతి ఉండదు. వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద కుడివైపు మలుపు తీసుకొని ఇందిరానగర్‌ మీదుగా ఐఐఐటీ జంక్షన్‌కు చేరుకోవాలి.టీసీఎస్‌ ఉద్యోగులకు మినహాయింపు: నాన్‌-ఎస్‌ఈజెడ్‌ (సీఎంసీ) గేట్‌ ద్వారా రాకపోకలు సాగించే టీసీఎస్‌ ఉద్యోగులు యథావిధిగా తమ గేట్‌ నుంచే ప్రయాణించవచ్చని పోలీసులు స్పష్టం చేశారు.లింగంపల్లి నుంచి రాడిసన్‌ హోటల్‌కు: లింగంపల్లి వైపు నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ వైపు వచ్చే వాహనాలు ఐఐఐటీ జంక్షన్‌ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద ఎడమవైపు మలుపు తీసుకోవాలి. అక్కడి నుంచి రాడిసన్‌ జంక్షన్‌ వద్ద మరోసారి ఎడమవైపు తిరిగి డీఎల్‌ఎఫ్‌ ప్రాంతానికి చేరుకోవాలి.
మరో ఏడాది పాటు ఫ్లైఓవర్‌ పనులు.....
ఐఐఐటీ జంక్షన్‌ వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు కనీసం మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. దీంతో ఈ ప్రాంతంలో రద్దీ కొనసాగే అవకాశముంది. ఐటీ ఉద్యోగులు, నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని, ప్రయాణ సమయాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌ నియంత్రణలో పోలీసులకు సహకరించాలని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ వాహనదారులను కోరారు.