BREAKING
'ఓఎమ్' చిత్రంలో ఐపీఎస్ నిత్యా రెడ్డిగా సాయి పల్లవి ఓటు హక్కును కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు : బిజెపిపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శలు స్థానిక ఎన్నికలకు టీడీపీ సై.. అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన మాలకొండయ్య..! నటి సునైనా ఏఐ వీడియో వివాదం రైతుల అభివృద్ధికి ఎఫ్‌పీవోలే వేదిక 25 ఏళ్ల తర్వాత 'లగాన్' నటి సందడి! వెలింగ్టన్‌లో మూడో టీ20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ వచ్చే ఏడాది డిసెంబర్‌ లోగా 550 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి - నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ పాటిల్‌ అక్షయ్ కుమార్ సినిమాపై కొత్త కండిషన్స్ 'మిషన్ కాశ్మీర్ ' జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న సోనాలి కులకర్ణి దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25% ఏపీకే.. ప్రియాంక 'దివాలీవిన్' వేడుకలు 8వ వార్డులో జనసేన అభ్యర్థి మురాదు విస్తృత ప్రచారం గొట్టిపాటి లక్ష్మి కృషితో తొలిసారి తాళ్లూరు ఎంపీపీ పీఠాన్ని దక్కించుకున్న టిడిపి. గుంటూరు: కార్పొరేషన్ ఎన్నికల ప్రచార సందడి

జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో శ్రీ పైడితల్లమ్మకు సారె సమర్పణ..

Select Suryaa Now
జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో శ్రీ పైడితల్లమ్మకు సారె సమర్పణ..


విజయ నగరం మేజర్ న్యూస్:
ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి పండగ సందర్భంగా జిల్లా ఎస్పీ  ఎఆర్ దామోదర్  అమ్మవారికి పట్టుచీర, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, స్వీట్స్, సారె సమర్పించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం, దేవాదాయ అధికారులు ఆలయ సంప్రదాయం ప్రకారం జిల్లా ఎస్పీ  కి పట్టు వస్త్రాలను, తీర్థ, ప్రసాదాలను, వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.
జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్  మాట్లాడుతూ  అమ్మవారి కృపా, కటాక్షాలు పోలీసుశాఖతోపాటు, ప్రజలందరిపైనా ఉండాలని, అందరికీ  మంచి జరగాలని ఆకాంక్షిస్తూ జిల్లా పోలీసుశాఖ తరుపున ప్రప్రదంగా  సారె సమర్పించామన్నారు. ముఖ్య ఘట్టమైన అమ్మవారి సిరిమానోత్సవం ఆర్నబ్ తుఫాను వలన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా సాగాలని అమ్మవారిని ప్రార్థించినట్లుగా తెలిపారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ, అందుకు తగిన ఏర్పాట్లను చేపట్టిందన్నారు. భక్తుల సహకారంతో సిరిమానోత్సవం సాయంత్రం 5గంటలకే ముగిసే విధంగా చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ  ఎఆర్ దామోదర్  తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ఎస్.లక్ష్మణమూర్తి, ఆర్.గోవిందరావు, ఎస్.రాఘవులు, ఈ.కోటిరెడ్డి, పలువురు సిఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.