ఉయ్యూరు 30వ వార్డులో యలమంచిలి బ్రమరాంబ ఇంటింటి ప్రచారం
ఉయ్యూరు, మేజర్ న్యూస్: ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ సతీమణి, మాజీ సర్పంచ్ యలమంచిలి బ్రమరాంబ 30వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ మహిళా సాధికారత, డ్వాక్రా సంఘాల అభివృద్ధి, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పన గురించి వివరించారు. ఉయ్యూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కూటమి చైర్మన్ అభ్యర్థి పాటి ప్రవీణ్ కుమార్, 30వ వార్డు టీడీపీ అభ్యర్థి రాజులపాటి అంజనాదేవికి సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, రాజులపాటి అంజనాదేవి, సయ్యద్ అజ్మతుల్లా, రాజులపాటి ఫణికుమార్, రాజులపాటి వెంకట్, జంపాన నల్ల, సలీం, జంపాన శంకరరావుతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.