BREAKING
శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు.... విద్యుత్ షాక్‌తో 17 ఏళ్ల యువకుడు మృతి.. పర్దీపురం గ్రామంలో తీవ్ర విషాదం* మూడు మండలాల్లో కూటమిదే ఆధిక్యం.. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ధీమా నేల ఆరోగ్య పరిరక్షణకు ‘ఖేత్ బచావో అభియాన్’ అబుదాబి ఎయిర్ పోర్టులో ఎలికట్టవాసి రజియా మృతి మన నగరం.. మన మనిషి.. మన మేయర్‌ అభ్యర్థి! జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో శ్రీ పైడితల్లమ్మకు సారె సమర్పణ.. అమ్మవారి ఆశీస్సులు అందరి పై ఉండాలి ....హోంమంత్రి అనిత యూఎన్‌ఎస్‌సీలో అందరికీ వీటో ఉండాల్సిందే: భారత్ డిమాండ్ ఏపీ స్థానిక ఎన్నికలపై కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ.. జడ్పీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని మద్యం మత్తులో మున్సిపల్ అధికారి హల్‌చల్‌..! దాబాలో శానిటేషన్ డీఈ వీరంగం సృష్టించారంటూ ఆరోపణలు ఏడు దశాబ్దాల్లో దక్షిణ భారతదేశంలో రికార్డు : భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధ్యయనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన శ్రీలక్ష్మి రాజేష్ దంపతులు ఉయ్యూరు 30వ వార్డులో యలమంచిలి బ్రమరాంబ ఇంటింటి ప్రచారం

మాదాపూర్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. అదుపులోకి ముగ్గురు విదేశీ మహిళలు

Select Suryaa Now
మాదాపూర్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. అదుపులోకి ముగ్గురు విదేశీ మహిళలు

మాదాపూర్,మేజర్ న్యూస్ : మాదాపూర్‌ పరిధిలోని ఓ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను మాదాపూర్‌, కూకట్‌పల్లి స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ పోలీసులు సంయుక్తంగా గుర్తించారు. చంద్రనాయక్‌ తండాలోని అపార్ట్‌మెంట్‌పై దాడులు నిర్వహించి, ముగ్గురు ఉజ్బెకిస్థాన్‌ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. విదేశీ మహిళలు సరైన పాస్‌పోర్టు, వీసా పత్రాలు లేకుండా నేపాల్‌ మీదుగా భారత్‌లోకి ప్రవేశించినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మాదాపూర్‌ పరిధిలోని చంద్రనాయక్‌ తండాలో ఉన్న సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందింది. 

దీంతో మాదాపూర్‌, కూకట్‌పల్లి ఎస్‌వోటీ బృందాలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్‌లోని 204వ నంబరు గదిలో ఉన్న ముగ్గురు ఉజ్బెకిస్థాన్‌ మహిళలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పాస్‌పోర్టు, వీసా పత్రాలు లేవని పోలీసులు గుర్తించారు.ఢిల్లీకి చెందిన నాయక్‌ అనే వ్యక్తి ఈ మహిళలను హైదరాబాద్‌కు తీసుకువచ్చి వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రధాన నిందితుడిగా గుర్తించిన నాయక్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉండటంతో అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మహిళలను హైదరాబాద్‌కు తీసుకురావడంలో మరెవరైనా సహకరించారా ? ఈ వ్యవహారంలో ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా ? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.అదుపులోకి తీసుకున్న ముగ్గురు మహిళలను చట్టపరమైన ప్రక్రియ అనంతరం కోర్టు ద్వారా స్వదేశానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

విదేశీ పౌరుల ప్రవేశం, వీసా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో వెలుగుచూసే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.ఈ ఘటన నేపథ్యంలో సర్వీస్‌ అపార్ట్‌మెంట్ల నిర్వాహకులకు పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. గదులు అద్దెకు ఇచ్చే ముందు కస్టమర్ల గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా తనిఖీ చేయాలని, వారి వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. నగరంలో సర్వీస్‌ అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, ఇతర తాత్కాలిక వసతి కేంద్రాల్లో నిబంధనలు అమలు కీలకమని పోలీసులు పేర్కొన్నారు.