చార్మినార్‌లో మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూమ్ పునఃప్రారంభం
హైదరాబాద్,మేజర్ న్యూస్ : మలబార్ గోల్డ్ & డైమండ్స్ సంస్థ హైదరాబాద్‌లోని చార్మినార్ షోరూమ్‌ను విస్తరించి పునఃప్రారంభించింది. రెండో అంతస్తును తాజాగా అందుబాటులోకి తీసుకురావడంతో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తుల్లో మొత్తం 11,802 చదరపు అడుగుల విస్తీర్ణంలో షోరూమ్‌ను ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా
చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫేకర్ అలీ షోరూమ్‌ను ప్రారంభించగా, మాజీ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, మలబార్ గ్రూప్ ఛైర్మన్ ఎం.పి. అహమ్మద్ ,డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఖాన్, తెలంగాణ జోనల్ హెడ్‌లు షానిబ్ కె., మహమ్మద్ షరీజ్ కె., రిటైల్ ఆపరేషన్స్ హెడ్ సిరాజ్ పి.కె., చార్మినార్ షోరూమ్ హెడ్ మహమ్మద్ అబ్దుల్ వహాబ్ పి., అసిస్టెంట్ షోరూమ్ హెడ్ సయ్యద్ అజ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు.ఈ షోరూమ్‌లో బంగారం, వెండి, ధ్రువీకరించిన వజ్రాలు, అన్‌కట్ వజ్రాలు, రత్నాలు, ప్లాటినం ఆభరణాల విస్తృత శ్రేణిని అందుబాటులో ఉంచారు. ఆధునిక 18 క్యారెట్ల బంగారు ఆభరణాలు, రోజువారీ వినియోగానికి అనువైన డిజైన్లతో పాటు, కాబోయే వధువుల కోసం ప్రత్యేక ఆభరణాల ఎంపిక సేవలను కూడా అందించనున్నారు. వినియోగదారులకు సౌకర్యవంతమైన కొనుగోలు అనుభవం కల్పించేందుకు ఆధునిక సదుపాయాలు, ప్రత్యేక అతిథి విశ్రాంతి గదిని ఏర్పాటు చేశారు.