ప్రజల భద్రతే లక్ష్యం.. ‘మీ సురక్ష 2.0’ మళ్లీ ప్రారంభం
శామీర్‌పేట, మేజర్ న్యూస్: ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ‘మీ సురక్ష 2.0’ కార్యక్రమాన్ని పోలీసులు తిరిగి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో పనిచేస్తున్న హెల్పర్లు, డ్రైవర్లు, కేర్‌టేకర్లు, ఇతర సహాయక సిబ్బందితో పాటు పరిసర ప్రాంతాల్లో కొత్తగా నివసించేందుకు వచ్చిన వ్యక్తుల వివరాలను అందుబాటులో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వెబ్‌సైట్ లింక్ ద్వారా నమోదు చేయాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు చెందిన సహాయక సిబ్బంది వివరాలను నమోదు చేయడం ద్వారా స్థానికంగా భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవచ్చని తెలిపారు. ప్రజల భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, సమాజ రక్షణ కోసం పోలీసులకు సహకరించాలని శామీర్‌పేట పోలీస్ స్టేషన్ అధికారులు విజ్ఞప్తి చేశారు. మన భద్రత.. మనందరి బాధ్యత అనే భావనతో ప్రతి ఒక్కరూ ‘మీ సురక్ష 2.0’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రిపోర్టర్: తాటికొండ రవి గౌడ్, ఉమ్మడి షామీర్పేట్, మేడ్చల్ జిల్లా.