ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ ప్రచారం.*ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమంపై ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న నర్సారెడ్డి భూపతిరెడ్డి
దుండిగల్ మేజర్ న్యూస్ :అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆదేశాల మేరకు చేపట్టిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ ప్రచార కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి పాల్గొన్నారు. ఏఐసీసీ పరిశీలకుడు మోహన్ కుమార మంగళం ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హనుమంత్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పార్టీ నాయకులు కృషి చేయాలని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రెస్‌మీట్‌లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.