కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భేటీ
నెల్లూరు, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రాజకీయ పరిణామాలు, ఎన్నికల వ్యూహాలు, అనుసరించాల్సిన కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. అలాగే అధికార పార్టీ చేపడుతున్న చర్యలు, తమ పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంటున్న ఇబ్బందులు, దౌర్జన్యాల ఆరోపణలపై కూడా చర్చించినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ముఖ్య నేతల మధ్య జరిగిన ఈ సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.