కూటమితోనే అభివృద్ధి సాధ్యం
డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కృషితో అభివృద్ధి పథం లో నియోజకవర్గం.
స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.
సూర్య న్యూస్ దర్శి. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కృషితో దర్శి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని దర్శి , ముండ్లమూరు ఎంపీపీ అభ్యర్థులు పోకూరు నారాయణస్వామి దేవినేని రమా కోటేశ్వరరావు అన్నారు. డాక్టర్ లక్ష్మీ కృషితో ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యకు కూడా పరిష్కరించడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం అభివృద్ధి అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించినట్లయితే అభివృద్ధి సంక్షేమం వేగంగా జరుగుతుందన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు.