BREAKING
దుబాయ్‌లో ఘనంగా యూఏఈ కౌండిన్య సేన (గౌడ బంధువుల) దసరా సంబరాలు గేమ్ ఛేంజర్ కథపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సంచలన వ్యాఖ్యలు.. అసలు మేటర్ ఇదే! సినిమా ట్విస్ట్‌పై దర్శకుడు పూర్వాజ్ సంచలన కామెంట్స్.. రాజమౌళి వ్యాఖ్యలపై స్పష్టత! తుపాను ప్రభావంతో జాతీయ సదస్సు వాయిదా కొండ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలే తప్ప అభివృద్ధి జరగలేదు...ఎంపీ బస్తిపాటి నాగరాజు కల్వల ప్రాజెక్ట్ ను ప్రభుత్వం వెంటనే పునర్నిర్మించాలి రైతులను మత్స్యకారులను బతికించాలి తాపీ పట్టి బేల్దారిగా మారిన మాజీ తలారి రంగయ్య మఠాధిపతి నియామకం. ప్రతిభా చాటిన విద్యార్థులను సన్మానించిన మాజీ మంత్రి హరీష్ రావు పత్తి దిగుబడి భారీగా తగ్గింది.. ఝరాసంగం మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కి తప్పిన పెను ప్రమాదం..దూసుకు వచ్చిన టపాసులు ఉద్రిక్తతగా మారిన మూసీ ప్రాజెక్టు సమావేశం! రుద్రంపల్లి నుండి వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభం* రైతులకు భరోసా.. వడ్ల కొనుగోళ్లలో పారదర్శకత!

అర్నబ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం

Select Suryaa Now
అర్నబ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం

విజయవాడ, మేజర్ న్యూస్: అర్నబ్ తుపాను ప్రభావం నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. తుపాను తీరం దాటే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు, కొండ ప్రాంతాల ప్రజల రక్షణకు పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని, అక్కడ ఆహారం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. చెట్లు విరిగిపడినా, విద్యుత్ స్తంభాలు నేలకొరిగినా, రహదారులు బ్లాక్ అయినా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని, విద్యుత్, తాగునీరు, రవాణాకు అంతరాయం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని, అత్యవసర వైద్య సేవలు, గర్భిణుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తుపాను ప్రభావం తగ్గినప్పటికీ భారీ వర్షాల నేపథ్యంలో నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీటిని యంత్రాల సహాయంతో వెంటనే తొలగించాలని, కాలువల్లో పూడిక తీసి నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రమాదకర చెట్ల కొమ్మలను తొలగించడంతో పాటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగించాలని సూచించారు. క్షేత్రస్థాయి సమాచారాన్ని వెంటనే నమోదు చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సహాయక చర్యలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, తుపాను ప్రభావం పూర్తిగా తగ్గేవరకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉంటూ అధికారులకు సహకరించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

 

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.