BREAKING
తుఫాను వేళ ఉయ్యూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చేనేత కుటుంబాల సంక్షేమమే లక్ష్యం.. నేతన్నలకు అండగా ఉంటా స్వతంత్ర అభ్యర్థి డి. నజీర్ అహ్మద్ మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలూ కరువు జాబితాలో ఉండటం బాధాకరం: బిఆర్ఎస్ రాష్ట్ర నాయకు రాలు పాల్వాయి స్రవంతి రెడ్డి రజినీకాంత్ ధర్మన్ మూవీ ఓటీటీ డీల్ రూ.150 కోట్లు నిజమేనా దుబాయ్‌లో ఘనంగా యూఏఈ కౌండిన్య సేన (గౌడ బంధువుల) దసరా సంబరాలు గేమ్ ఛేంజర్ కథపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సంచలన వ్యాఖ్యలు.. అసలు మేటర్ ఇదే! సినిమా ట్విస్ట్‌పై దర్శకుడు పూర్వాజ్ సంచలన కామెంట్స్.. రాజమౌళి వ్యాఖ్యలపై స్పష్టత! తుపాను ప్రభావంతో జాతీయ సదస్సు వాయిదా కొండ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలే తప్ప అభివృద్ధి జరగలేదు...ఎంపీ బస్తిపాటి నాగరాజు కల్వల ప్రాజెక్ట్ ను ప్రభుత్వం వెంటనే పునర్నిర్మించాలి రైతులను మత్స్యకారులను బతికించాలి తాపీ పట్టి బేల్దారిగా మారిన మాజీ తలారి రంగయ్య మఠాధిపతి నియామకం. ప్రతిభా చాటిన విద్యార్థులను సన్మానించిన మాజీ మంత్రి హరీష్ రావు పత్తి దిగుబడి భారీగా తగ్గింది.. ఝరాసంగం మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి.

రాత్రివేళ రైళ్లలో మొబైల్ ఛార్జింగ్ పై నిషేధం..

Select Suryaa Now
రాత్రివేళ రైళ్లలో మొబైల్ ఛార్జింగ్ పై నిషేధం..

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   రైళ్లలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రైల్వే బోర్డు  కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదు గంటల మధ్యలో అన్ని ఛార్జింగ్ పాయింట్లు మూసివేసి ఉంచాలని, ఆ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అన్ని జోన్లకు ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల ముంబయి లోకల్ రైలులో ఛార్జింగ్ పెడుతుండగా.. ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ పేలిపోయిన సంగతి తెలిసిందే . దాంతో కోచ్ అంతా దట్టమైన పొగ నిండిపోయింది. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాత్రి 11 గంటల నుంచి ఆరు గంటల పాటు రైళ్లలోని కోచ్లలో ఉన్న మొబైల్, ల్యాప్టాప్ ఛార్జింగ్ పాయింట్లు స్విచ్ఛాఫ్ చేసేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని అన్ని జోన్లకు బోర్డ్ సూచించింది. అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ భద్రతా చర్యలను అమలు చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించింది. రాత్రి సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటం వల్ల ఓవర్ హీటింగ్, షార్ట్ సర్క్యూట్ జరిగితే వెంటనే గుర్తించడం కష్టమవుతోంది. దాంతో భారీ అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ఈ ముందు జాగ్రత్త చర్య చేపట్టారు. అయితే.. రైళ్లలో రాత్రి పూట ఛార్జింగ్పై ఆంక్షలు 2014లోనే తీసుకువచ్చారు.తాజా ఘటన నేపథ్యంలో వీటిని కట్టుదిట్టంగా అమలు చేసేలా రైల్వే బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది.