BREAKING
రైతులకు భరోసా.. వడ్ల కొనుగోళ్లలో పారదర్శకత! రాత్రివేళ రైళ్లలో మొబైల్ ఛార్జింగ్ పై నిషేధం.. సెట్టూరు మండలం మాజీ Z. P. T. C V.నాగరత్న భర్తకు ఘన నివాళులు అర్పించిన తెలుగు తమ్ములు కూటమితోనే అభివృద్ధి సాధ్యం అశ్వారావుపేటలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, కాంగ్రెస్ నాయకులు చింతకుంట చెరువు పరిరక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలి అర్నబ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం ఎలుగుబంటి దాడిలో గొర్రెల కాపరికి తీవ్ర గాయాలు. అందరి చూపు కంబదూరు వైపు. పొగాకుకు దూరంగా ఉండాలి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.. రక్తదానం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు 108 అంబులెన్స్‌లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ.. నియోజకవర్గ అభివృద్ధిపై లేదు కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భేటీ నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు తొలగింపు – సాఫీగా సాగుతున్న ట్రాఫిక్

విద్యార్థులు మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు -ఎమ్మెల్సీ కూచకుల్ల దామోదర్ రెడ్డి -నషా ముక్త్ భారత్ అభియాన్ డ్రగ్స్ ఫ్రీ ర్యాలీ

Select Suryaa Now
విద్యార్థులు మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు  -ఎమ్మెల్సీ కూచకుల్ల దామోదర్ రెడ్డి  -నషా ముక్త్ భారత్ అభియాన్ డ్రగ్స్ ఫ్రీ ర్యాలీ

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి,తమ జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టాలని, డ్రగ్స్ కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని, సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్ అని ఎమ్మెల్సీ కూచికుల్ల దామోదర్ రెడ్డి సూచించారు. ఇండియన్  రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ అభియాన్ - డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ లో భాగంగా  ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నాగర్ కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని గీతాంజలి జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించి మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు. అనంతరం విద్యార్థులందరితో మాదక ద్రవ్యాల రహిత భారతదేశం కోసం ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ  విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎక్కడైనా మత్తు పదార్థాల వినియోగం చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మునిసిపల్ చైర్మన్ సునెంద్ర కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు అలవాటై బంగారు భవిష్యత్తు పాడుచేసుకోవద్దని సూచించారు.  ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్  రెడ్ క్రాస్ చైర్మన్ సాయిబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో, పాఠశాలల్లో  అవగాహన కార్యక్రమాలను విస్తరిస్తామని తెలిపారు. కార్యక్రమం లో వైస్ చైర్మన్ రాధాకృష్ణ , రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడు రమేష్ రెడ్డి,రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు రాజ మహేందర్ రెడ్డి, డాక్టర్ రోహిత్ కుమార్ , కళాశాల కరస్పండెంట్ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.
పి.వినయ్ కుమార్,  నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ  దామోదర్ రెడ్డి