BREAKING
కల్వల ప్రాజెక్ట్ ను ప్రభుత్వం వెంటనే పునర్నిర్మించాలి రైతులను మత్స్యకారులను బతికించాలి తాపీ పట్టి బేల్దారిగా మారిన మాజీ తలారి రంగయ్య మఠాధిపతి నియామకం. ప్రతిభా చాటిన విద్యార్థులను సన్మానించిన మాజీ మంత్రి హరీష్ రావు పత్తి దిగుబడి భారీగా తగ్గింది.. ఝరాసంగం మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కి తప్పిన పెను ప్రమాదం..దూసుకు వచ్చిన టపాసులు ఉద్రిక్తతగా మారిన మూసీ ప్రాజెక్టు సమావేశం! రుద్రంపల్లి నుండి వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభం* రైతులకు భరోసా.. వడ్ల కొనుగోళ్లలో పారదర్శకత! రాత్రివేళ రైళ్లలో మొబైల్ ఛార్జింగ్ పై నిషేధం.. సెట్టూరు మండలం మాజీ Z. P. T. C V.నాగరత్న భర్తకు ఘన నివాళులు అర్పించిన తెలుగు తమ్ములు కూటమితోనే అభివృద్ధి సాధ్యం అశ్వారావుపేటలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, కాంగ్రెస్ నాయకులు చింతకుంట చెరువు పరిరక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలి అర్నబ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం

మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ.. నియోజకవర్గ అభివృద్ధిపై లేదు

Select Suryaa Now
మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ.. నియోజకవర్గ అభివృద్ధిపై లేదు

శివన్నగూడెం, రాచకొండ ప్రాజెక్టుల కోసం పార్టీలకతీతంగా పోరాడాలి: చలమల కృష్ణారెడ్డి

సంస్థాన్‌ నారాయణపురం మేజర్ న్యూస్: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న చిత్తశుద్ధి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపై లేదని కాంగ్రెస్‌ నేత చలమల కృష్ణారెడ్డి విమర్శించారు. బుధవారం నారాయణపురం మండలం రాజన్నబావిలో సొంత నిధులతో చేపట్టనున్న రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివన్నగూడెం, రాచకొండ ప్రాజెక్టులను సాధించేందుకు పార్టీలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించేలా సంబంధిత మంత్రులను నియోజకవర్గానికి ఆహ్వానించాలని సూచించారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.