నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు తొలగింపు – సాఫీగా సాగుతున్న ట్రాఫిక్
బాపట్ల, మేజర్‌న్యూస్ :
బాపట్ల జిల్లా ఎస్పీబి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, అర్నబ్ తుఫాను ప్రభావం దృష్ట్యా నగరం పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా, నగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపట్నం - రేపల్లె ప్రధాన రహదారిపై తుఫాను ఈదురుగాలులకు భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే నగరం ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టు కొమ్మలను యుద్ధప్రాతిపదికన తొలగించారు. ప్రస్తుతం రహదారిపై వాహనాల రాకపోకలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతున్నాయి.