అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో వాడరేవులో ఎమ్మార్వో గోపి కృష్ణ పర్యవేక్షణ
అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో వాడరేవులో ఎమ్మార్వో గోపి కృష్ణ పర్యవేక్షణ
వాడరేవు:అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో చీరాల మండలం వాడరేవు తీరప్రాంతంలో ఎమ్మార్వో గోపి కృష్ణ పర్యటించి, తుఫాన్ పరిస్థితులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తీరప్రాంత ప్రజలకు పలు సూచనలు చేశారు. బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.