BREAKING
కల్వల ప్రాజెక్ట్ ను ప్రభుత్వం వెంటనే పునర్నిర్మించాలి రైతులను మత్స్యకారులను బతికించాలి తాపీ పట్టి బేల్దారిగా మారిన మాజీ తలారి రంగయ్య మఠాధిపతి నియామకం. ప్రతిభా చాటిన విద్యార్థులను సన్మానించిన మాజీ మంత్రి హరీష్ రావు పత్తి దిగుబడి భారీగా తగ్గింది.. ఝరాసంగం మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కి తప్పిన పెను ప్రమాదం..దూసుకు వచ్చిన టపాసులు ఉద్రిక్తతగా మారిన మూసీ ప్రాజెక్టు సమావేశం! రుద్రంపల్లి నుండి వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభం* రైతులకు భరోసా.. వడ్ల కొనుగోళ్లలో పారదర్శకత! రాత్రివేళ రైళ్లలో మొబైల్ ఛార్జింగ్ పై నిషేధం.. సెట్టూరు మండలం మాజీ Z. P. T. C V.నాగరత్న భర్తకు ఘన నివాళులు అర్పించిన తెలుగు తమ్ములు కూటమితోనే అభివృద్ధి సాధ్యం అశ్వారావుపేటలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, కాంగ్రెస్ నాయకులు చింతకుంట చెరువు పరిరక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలి అర్నబ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం

నాగేపల్లి–గుడిబండ ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ

Select Suryaa Now
నాగేపల్లి–గుడిబండ ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ



గుడిబండ మండలంలోని నాగేపల్లి నుంచి గుడిబండకు వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో తుంగభద్ర తాగునీటి పైపులైన్ లీకేజీ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి మధ్యలోనే నీరు అధికంగా ప్రవహిస్తుండటంతో రోడ్డు దెబ్బతిని గుంతలు ఏర్పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మార్గం గుండా నిత్యం రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు లీకేజీ నీటి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సంత మార్కెట్‌కు వెళ్లే రైతులు, వ్యాపారులు, ప్రయాణికులు ఈ సమస్యతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. రహదారి మధ్యలో నీరు ప్రవహిస్తుండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.పైపులైన్ నుంచి నీరు నిరంతరం లీకేజీ కావడం వల్ల రహదారి కింద ఉన్న మట్టి బలహీనపడి రోడ్డు కుంగిపోయే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి లీకేజీని అరికట్టడంతోపాటు పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టి, రహదారికి ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రయాణికులు, వాహనదారులు, రైతులు, స్థానిక ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

గుడిబండ రిపోర్టర్ దేవరాజు